![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-143 లో... చందు, శ్రీవల్లీలకి శోభనం జరిపించాలని రామరాజుకి వేదవతి చెప్తుంది. అలాగే ఏర్పాటు చేయించు, మన పెద్దోడికి మంచి భార్య దొరికిందని రామరాజు ఎమోషనల్ అవుతాడు. పనిలో పని నర్మద, సాగర్ లకి కూడ శోభనం ఏర్పాట్లు చేద్దామని వేదవతి అడుగగా.. సరేనని రామరాజు అంటాడు. వేదవతి హ్యాపీగా ఫీల్ అవుతుంది.
ఆ తర్వాత తిరుపతి, ధీరజ్ ఇద్దరు శోభనం ఏర్పాట్లు చేస్తుంటారు. గదిని డెకరేషన్ చేస్తారు. ఒకవైపు చందు, సాగర్ రెడీ అవుతారు. ఇన్ని రోజులు మీరెందుకు దూరం గా ఉన్నారని సాగర్ ని చందు అడుగుతాడు. మేం నీకంటే ముందు పెళ్లి చేసుకొని తప్పు చేసాం.. ఇక పిల్లల్ని కంటే ఇంకా తప్పవుతుంది. అందుకే నీకు పెళ్లి అయ్యేవరకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నామని సాగర్ అంటాడు. కామాక్షి, అమూల్య ఇద్దరు శ్రీవల్లి నర్మదలని రెడీ చేస్తారు. శ్రీవల్లి కంటే నర్మద బాగుందని కామాక్షి అంటుంది. దాంతో శ్రీవల్లి బాధపడుతూ వెళ్లి భాగ్యంకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తుంది. అయిన వాళ్ళకి ఇప్పుడు శోభనం ఏంటి ఆపేయ్ వాళ్ళ కంటే ముందు నువ్వు పిల్లలని కను అని ఏదో భాగ్యం ప్లాన్ చెప్తుంది. దానికి శ్రీవల్లి సరే అంటుంది.
ఆ తర్వాత రామరాజు, వేదవతి దగ్గరికి శ్రీవల్లి వచ్చి.. మా శోభనం కాన్సిల్ చెయ్యండి సాగర్, నర్మదలకి జరిపించండి అని శ్రీవల్లి అంటుంది. ఎందుకు అలా అంటున్నవ్ అని వేదవతి అడుగుతుంది. ఒకే ఇంట్లో రెండు జంటలకి శోభనం ఒకే రోజు జరగొద్దు అంట అని శ్రీవల్లి అంటుంది. దాంతో అందరు ఆశ్చర్యంగా చూస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |